పండగసేల్స్‌పై నిషేధం విధించాలి

flipkart
flipkart

ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్‌లపై ఫిర్యాదులు


ముంబయి: ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల పండుగసీజన్‌ అమ్మకాలపై నిషేధం విధించాలని సాప్రందాయ బద్ధమైన రిటైల్‌ మార్కెట్‌ వ్యాపారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసారు. అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య (కైట్‌) ఈమేరకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖకు ఫిర్యాదులుచేసింది. అంతేకాకుండా విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు సాగుతున్నాయని వాదించింది. ఈ సంస్థలు ఆఫర్‌ చేస్తున్న భారీ డిస్కౌంట్లు దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లయిందని ఆరోపిస్తున్నారు. ఈ రెండు ఇకామర్స్‌ సంస్థలు పండగ సీజన్లలో భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇఎంఐ ఆఫర్లు కూడా ఎక్కువ ప్రవేశపెడుతున్నాయి. అంతేకాకుండా ఫలానా బ్యాంకు కార్డుపై చేస్తే పదిశాతం డిస్కౌంట్‌ అని ఎరవేస్తున్నాయి. దీనితో రిటైల్‌ వర్తకులకు పండగ సీజన్లలో భారీ నష్టాలు ఎదురవుతున్నాయి.ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఈ పండగసేల్స్‌పై నిషేధం విధించాలని డిమాండ్‌చేస్తున్నాయి. వాల్‌మార్ట్‌ అధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌ ఆరురోజుల విక్రయాలు ఈనెల 29వ తేదీ ప్రారంభం అవుతున్నాయి. అమెజాన్‌ ఇంకా తేదీలను ప్రకటించాల్సి ఉంది. రెండుసంస్థలుసైతం భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఫ్యాషన్‌ దుస్తులనుంచి స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిసైఔ్కంట్లు ఆఫర్‌చేస్తున్నాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/