ఢిల్లీలో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం

ఢిల్లీ ప్ర‌భుత్వం అధికారిక ఉత్త‌ర్వులు జారీ

ban-on-firecrackers-in-delhi-ncr-from-midnight

న్యూఢిల్లీ: ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో బాణ‌సంచా విక్ర‌యాలు, వాటిని కాల్చ‌డంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ నిషేధం విధించింది. బాణ‌సంచా విక్ర‌యాలు, కాల్చ‌డంపై నిషేదాజ్ఞ‌లు ఈరోజు అర్థ‌రాత్రి నుంచి న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు ఎన్జీటీ పేర్కొంది. ఎన్‌సీఆర్ ప‌రిధిలోని నాలుగు రాష్ర్టాల్లో గ‌ల రెండు డ‌జ‌న్ల‌కు పైగా ప‌ట్ట‌ణాల‌కు ఈ ఆదేశాలు వ‌ర్తించ‌నున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం అధికారిక ఉత్త‌ర్వులు జారీచేసింది.కాలుష్యం సాధార‌ణ‌మైన న‌గ‌రాల్లో ప‌ర్యావ‌ర‌ణహిత క్రాక‌ర్ల‌ను వెలిగించ‌వ‌చ్చంది. ప‌ర్యావ‌ర‌ణహిత క్రాక‌ర్ల‌ను ఉద‌యం 8 నుంచి రాత్రి 10 గంట‌ల‌కు వెలిగించవ‌చ్చ‌ని పేర్కొంది. ఒక‌వైపు వాయు కాలుష్యం పెరుగుతుండ‌టం మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కేసులు అధిక‌మౌతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 7,745 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/