వచ్చే నెల 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. జూలై 13న ఎల్లమ్మ కల్యాణం మహోత్సవం, 14న రథోత్సవం ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి కల్యాణం, ఉత్సవాలకు సీఎం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించారని తెలిపారు. ఎల్లమ్మ తల్లి ఉత్సవాల దృష్ట్యా కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/