కేంద్ర ప్రభుత్వంపై బాల్క సుమ‌న్ విమర్శలు

Balka Suman
Balka Suman

టిఆర్ఎస్ vs బిజెపి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సభ , సమావేశాల్లోనే కాకుండా సోషల్ మీడియా లోను పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నేతలు , బిజెపి నేతలు ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మరోసారి కేంద్రం ఫై ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు.

రూపాయికి భరోసా లేదని.. అధిక ధరలకు అంతం లేదంటూ ఆరోపించారు బాల్క సుమన్‌. జీడీపీ నేల చూపులు చూస్తోంటే… ఆర్థిక వ్యవస్థ ఆగమై పోయిందని బాల్క సుమన్‌ ఎద్దేవా చేశారు. దేశం చీకట్లో మగ్గిపోతోంటే… అదానీ, అంబానీలు వెలిగిపోతున్నారని , యువతకు ఉద్యోగాల్లేవని… ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ లేదని ఆయ‌న మండిపడ్డారు. అంతేకాకుండా కమాల్ మోడీ .. ఢమాల్ ఇండియా పేరిట‌ దేశంలో బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంద‌ని దెప్పి పొడిచారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు సైతం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు.