భూకబ్జాలు, దందాలు కాంగ్రెస్‌ నేతలకే అలవాటు

Balka Suman
Balka Suman

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యె బాల్క సుమన్‌ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంఖిపూర్‌ రాజుపై ఎంపి కోమటిరెడ్డి పత్రికలో వచ్చిన వార్తలను చూసి ఆరోపణలు చేయడాని ఖండించారు. రాజుపై వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే శంభిపూర్ రాజు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని చెప్పారు. భూకబ్జాలు, దందాలు చేయటం కాంగ్రెస్ నేతలకే అలవాటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అవినీతి పనులు చేశారో చరిత్ర బయటికి తీయమంటారా? అని ప్రశ్నించారు. కాగా రాజకీయాల్లో ఎదుగుతున్న బలహీన వర్గాల నాయకులపై కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని బాల్క సుమన్‌ మండిపడ్డారు.


తాజా సినిమా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos