రైతులపై విద్యుత్‌ బిల్లుల భారం పడదు

చంద్రబాబు అప్పట్లో ఉచిత విద్యుత్‌ను అవహేళన చేశారు

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy

అమరావతి: తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్‌ నిర్ణయంపై టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై ఏపి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ విమర్శలకు సమాధానమిచ్చారు. ‘రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా చేస్తా.. దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. ‘బషీర్‌బాగ్‌ కాల్పులు గుర్తున్నాయ్‌ బాబూ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్‌లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. ఆయన నిర్వాకాలను ఎవరూ మరచిపోలేదు’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/