రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం ఫై అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమైందని అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేయడం తో ఆ పార్టీ శ్రేణులను సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలతో వైస్సార్సీపీ ఓటమి మొదలైందని , రాబోయే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా వైస్సార్సీపీ నేతలు మాత్రం ఇదే ఆఖరి ఫలితాలు మీకు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ ఫలితాలపై ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు స్పందించగా..తాజాగా వైస్సార్సీపీ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ఓటిమిపై తాము సమీక్షించుకుంటామని , ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో అర్థమయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఓటర్లలో వీరి శాతం రెండు శాతం మాత్రమేననే విషయాన్ని గుర్తించాలని చెప్పుకొచ్చారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకే మొత్తం గెలిచేసినట్టు టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారని…. ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.