పట్టుబడ్డ డబ్బుపై స్పందించిన బాలినేని

కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదు

YSRCP minister Balineni Srinivas Reddy

అమరావతి: ఏపి నుండి చెన్నై వెళుతున్నా ఓ కారులో రూ.5 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటంతో, ఇది వైఎస్‌ఆర్‌పి అక్రమ సంపాదన అని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈవిషయంపై బాలినేని స్పందించారు. ఈ కారుకు, పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం విచారణలో తెలుస్తుందని తెలిపారు. తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/