ఆహా లో నటసింహం టాక్ షో..ఇక ఆహా అనుకుండా ఉంటామా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు వెండితెర ఫై మాత్రమే బాలయ్య ను చూసాం..ఇక ఇప్పుడు ఓటిటి లో బాలయ్య సందడి చూడబోతున్నాం. ఆహా ..ప్రేక్షకులు , అభిమానులకోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించబోతున్నారు. ఈ షో కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఓటిటి హావ నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నటి నటులు , దర్శకులు , నిర్మాతలు ఓటిటి సినిమాలు చేస్తూ..నటిస్తున్నారు. అలాగే హోస్ట్ గా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య కూడా అదే బాటలోకి వెళ్లారు.

ఈ షోకు మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అతిథిలుగా వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గురువారం ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట. మరి రేపు అరవింద్ ఏ ఏ విషయాలు చెపుతారో..ఈ షో ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.