ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట

గణేశ్ లడ్డూ చేజిక్కించుకుంటే శుభం కలుగుతుందన్న భావన

Balapur Ganesh -Laddu
Balapur Ganesh -Laddu

హైదరాబాద్‌: వినాయకుడి చేతిలోని లడ్డూ… సకల శుభాలను, అష్టైశ్వర్యాలనూ కలిగిస్తుందని భక్తులు నమ్మే మహా ప్రసాదం. 11 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తూ, వారితో ప్రత్యేక పూజలు అందుకునే గణనాధుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు వందలాది మంది పోటీ పడుతుంటారు. గణేష్ లడ్డూ వేలం అనగానే, తెలుగు రాష్ట్రాల్లో మొదట గుర్తుకు వచ్చేది, హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లడ్డూనే అయితే అక్కడి లడ్డూ ఈసారి ఎంత ధర పలుకుతుందోనని తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా తిలకిస్తాయి. 1994లో జరిగిన తొలిసారి వేలం పాటలో లడ్డూ రూ.450 ధర పలికింది. అప్పటి నుంచి అప్రతిహతంగా లడ్డూ ధర అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత ఏడాది రూ.16.60లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. ఈ ఏడాది ఎంత పలుకుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొద్దిసేపటి క్రితం బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. బాలాపూర్ లడ్డూ వేలంలో 28 మంది భక్తులు పాల్గొన్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/