రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డు

దేశ వ్యాప్తంగా బాలాపూర్ లడ్డు కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది వినాయక చవితి కి వినాయకుడి లడ్డును వేలం వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును దక్కించుకుంటుంటారు. గత ఏడాది కరోనా కారణంగా లడ్డు వేలంపాట జరగలేదు. ఈ ఏడాది రికార్డు ధర కు లడ్డు ను మర్రి శశాంక్ రెడ్డి దక్కించుకున్నారు. వేలంపాటలో రూ.18 .9 లక్షలు పలికి లడ్డును దక్కించుకున్నారు. క‌డ‌ప జిల్లాకు చెందిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌లు కలిసి ఈ లడ్డును దక్కించుకున్నారు.. ఈ ల‌డ్డూను త్వ‌ర‌లోనే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేస్తామ‌ని తెలిపారు. ఈ వేలంలో ల‌డ్డూను ద‌క్కించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, ఏపీలోని 13 జిల్లాల ప్ర‌జ‌ల త‌ర‌పున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అందిస్తామ‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాలాపూర్ గ‌ణ‌ప‌తిని కోరుకున్న‌ట్టు ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ తెలిపారు.

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసిరావండంతో, 1995లో రూ. 4500 లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం బాగా కల్సివచ్చింది. దీనితో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది వందల నుండి వేలు, వేలు నుండి లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది.

లడ్డు వేలం పాటలో దక్కించుకున్నవారు వీరే..

1994 – కొలను మోహన్ రెడ్డి – రూ.450,
1995 – కొలను మోహన్ రెడ్డి – రూ.4500,
1996- కొలను కృష్ణారెడ్డి – రూ.18,000,
1997- కొలను కృష్ణారెడ్డి – రూ.28,000,
1998- కొలను మోహన్ రెడ్డి – రూ.51,000,
1999- కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ.65,000,
2000- కళ్లెం అంజిరెడ్డి – రూ.66,000
2001- జి. రఘునందన్ చారి – రూ.85,000
2002- కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000 లక్షలు
2003- చిగురింత బాల్ రెడ్డి – రూ.1,55,00 లక్షలు
2004- కొలన్ మోహన్ రెడ్డి – రూ.2,01,000 లక్షలు
2005- ఇబ్రహీం శేఖర్ – రూ.2,08,000 లక్షలు
2006- చిగురింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000 లక్షలు
2007- రఘునందన్ చారి – రూ.4,15,000 లక్షలు
2008- కొలన్ మోహన్ రెడ్డి – రూ.5,07,000 లక్షలు
2009- సరిత – రూ.5,10,000 లక్షలు
2010- కొడాలి శ్రీధర్ బాబు – రూ.5,35,000 లక్షలు
2011- కొలన్ ఫ్యామిలీ – రూ.5,45,000 లక్షలు
2012- పన్నాల గోవర్థన్ – రూ.7,50,000 లక్షలు
2013- తీగల కృష్ణారెడ్డి – రూ.9,26,000 లక్షలు
2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9,50,000 లక్షలు
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000 లక్షలు
2016- స్కైలాబ్ రెడ్డి – రూ.14,65,000 లక్షలు
2017- నాగం తిరుపతి రెడ్డి – రూ.15,60,000 లక్షలు
2018- శ్రీనివాస్ గుప్తా – రూ.16,60,000లక్షలు
2019- కొలను రామిరెడ్డి – రూ.17,60,000 లక్షలు