‘బింబిసార‌’ చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ

నందమూరి నటించిన ‘బింబిసార‌’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్..బింబిసార‌ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. థియేటర్స్ కు ప్రేక్షకులు రాని సమయంలో బింబిసార‌ తో మళ్లీ థియేటర్స్ కు కళ తీసుకొచ్చాడు. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టిందంటే ఈ మూవీ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని చూసిన చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కళ్యాణ్ రామ్ కు అలాగే చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ అందించగా..తాజాగా బాలకృష్ణ చిత్రాన్ని చూసారు.

బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి బింబిసార సినిమా చూశాడు. డైరెక్టర్ వశిష్ట, టీం కూడా బాలయ్యతో పాటు సినిమా చూశారు. సినిమా చాలా బావుందని.. బాలయ్య, కళ్యాణ్ రామ్‌తో పాటు బింబిసార టీంకు అభినందనలు తెలిపాడు. బాల‌కృష్ణ‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ సోద‌రి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఫాంటిసీ యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రీన్ ట్రెసా, సంయుక్త మీన‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. కీర‌వాణి సంగీతం అందించాడు.