జూ. ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలిచినా బాలకృష్ణ చిన్నల్లుడు

జూ. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ఎన్టీఆర్ పేరు రాజకీయ నేతలు ప్రస్తావిస్తూ వైరల్ చేస్తుంటారు. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ లో తనకు , తన భార్య కు జరిగిన అవమానంపై ఆయన కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులు , ఎన్టీఆర్ సైతం వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరు ఫై టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఎన్టీఆర్ పిరికి ధోరణిలో మాట్లాడారని, సింహంలా గర్జిస్తాడనుకుంటే చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు పలికారంటూ వర్ల రామయ్య అన్నారు. ఈయన మాత్రమే కాకుండా మరికొంతమంది ఎన్టీఆర్ కామెంట్స్ ఫై విమర్శలు చేసారు. దీంతో నెట్టింట టీడీపీ Vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ ముదిరింది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఈ వ్యవహారం స్పందించి ఎన్టీఆర్‌ కు సపోర్ట్ గా మాట్లాడారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ చాలా పరిణతితో కూడిన వాదన వినిపించారని, ఆయన స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించ దగినదని పేర్కొన్నారు. దీని గురించి చర్చించడం సరికాదని చెబుతూ ఈ ఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌‌ను అభినందించాలని భరత్ అన్నారు.

అసలు ఎన్టీఆర్ ఏమన్నారో చూస్తే..

ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటన తన మనసును కలచివేసింది అన్నారు. ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడడం అరాచకపాలనకు నాంది పలుకుతుందన్నారు. స్త్రీలను గౌరవించడం మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని అన్నారు. మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది తప్పని చెప్పారు.

కుటుంబసభ్యుడిగా మాట్లాడట్లేదు.. ఈ మాటలను తాను ఓ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశానికి పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను అని అన్నారు. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయాలని రాజకీయ నాయకులను కోరారు. పోరాటం ప్రజా సమస్యలపై ఉండాలని, రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా ఉండాలని,.. ఇది ఇక్కడితో ఆగిపోవాలని మనసారా కోరుకుంటున్నానని ఎన్‌టీఆర్ తన ట్విటర్ వీడియో ద్వారా తెలిపారు.