రవితేజ-బాలకృష్ణల మల్టీస్టారర్ మూవీ..డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ , కృష్ణ , ఏఎన్నార్, కాంతారావు టైములో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ వచ్చేవి. ఆ తరువాత మల్టీస్టారర్ మూవీస్ తగ్గిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఊపందుకున్నాయి. తమ ఇమేజ్ ను పక్కన పెట్టి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ నటులు పోటీపడుతున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. అలాగే ప్రస్తుతం సెట్స్ ఫై కూడా పలువురు హీరోల కలయికలో సినిమాలు రాబోతున్నాయి.

ఈ తరుణంలో మరో క్రేజీ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది. అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వినికిడి. ఇందులో బాలకృష్ణతో పాటు రవితేజ హీరోలుగా నటిస్తారని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో దీనిపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం అనిల్ ..వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.