రేపు హిందూపురంలో ర్యాలీ నిర్వహించనున్న బాలకృష్ణ

హిందూపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాకు డిమాండ్


అమరావతి : హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై రేపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/