వైస్సార్సీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి – బాలకృష్ణ

రాష్ట్రంలో వైస్సార్సీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ గర్జన తర్వాత ఎయిర్పోర్ట్ లో వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని , ఈ దాడి చేయించింది పవన్ కళ్యాణ్ అని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ వారి ఫై కేసులు పెట్టడం , అరెస్ట్ చేయడం..అలాగే పవన్ కళ్యాణ్ విశాఖ ను వదిలి వెళ్లాలని నోటీసులు జారీ చేయడం ఇవ్వన్నీ కూడా ఉద్రిక్తతకు దారి తీశాయి. ప్రస్తుతం పవన్ వైజాగ్ నోవాటెల్ ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

ఇదిలా ఉంటె.. ఆదివారం హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం వరద ప్రాంతాల్లో పర్యటించానని, బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు కోరారని వెల్లడించారు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు బాలకృష్ణ. బ్రిడ్జిల నిర్మాణంపై ప్రభుత్వం స్పందించకపోతే, టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మిస్తామని స్పష్టం చేశారు బాలకృష్ణ. వైస్సార్సీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోవడం వల్లే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని బాలకృష్ణ వెల్లడించారు. బాలయ్య తన పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.