బాలయ్య – కాజల్ ఫై షూటింగ్

నందమూరి బాలకృష్ణ – కాజల్ జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ధమాకా ఫేమ్ శ్రీలీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురి గా నటించడం మరో విశేషం. గత కొద్దీ రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుండగా..తాజాగా ఈ చిత్ర కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని నానక్ రామగూడాలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ – కాజల్ ఫై పలు సన్నివేశాలు షూట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

బాలకృష్ణ 108 మూవీ కావడం.. అఖండ, వీర సింహ రెడ్డి మూవీస్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడం తో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే అనిల్ రావిపూడి సినిమా విషయంలో ఎక్కడ తగ్గకుండా చాల జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ షైన్ స్క్రీన్ వారు నిర్మిస్తున్నారు.