టర్కీ కి బాలయ్య..

నందమూరి బాలకృష్ణ టర్కీకి పయనం కాబోతున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫారిన్లో ప్లాన్ చేసింది మేకర్స్. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు బాల‌య్య స‌హా మెయిన్ టీమ్ అంతా ట‌ర్కీ వెళ్లబోతున్నార‌ట‌. ముఖ్యంగా అక్కడ పాటలు, కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. ఈ సినిమాలో మ‌రోసారి బాలయ్య ద్విపాత్రాభిన‌యంలో క‌నిపిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని క‌థ‌ను రాసుకున్నారు. రీసెంట్‌గానే బాల‌య్య రోల్‌కు సంబంధించిన లుక్‌, ప్రోమోను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. దసరా బరిలో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.