రియలిస్టిక్‌ యాక్షన్స్‌

బాలకృష్ణతో ‘బోయపాటి’ మూవీ

రియలిస్టిక్‌ యాక్షన్స్‌
Bala Krishna

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓసినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే వినయ విధేయ రామ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా కోసం చాలాగ్యాప్‌ తీసుకున్నారు. కాగా బాలయ్యతో చేస్తున్న ఈసినిమాలో యాక్షన్‌ను కాస్త రియలిస్టిక్‌గా తీయాలని ప్లాన్‌చేస్తున్నారని తెలిసింది.

ఇక కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్‌సిటీలో తర్వాత షెడ్యూల్‌ను స్టార్ట్‌చేయనున్నారట.ఇక ఈచిత్రానికి సంబంధించిన ఆప్‌డేట్‌కోసం బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కన్పించనున్నారు..

వాటిలో ఒకటి అఘెరా పాత్ర కావటం, పూగా ఆ పాత్ర కోసం బాలయ్య ఎంతో ఆసక్తికరమైన గెటప్‌లో కన్పించనున్నారట.. ఈచిత్రంలో అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/