ఒలింపిక్‌ బెర్త్‌ ఖాయం చేసుకునన భజరంగ్‌ పూనియా, రవి దహియా….

bajrang punia
bajrang punia


నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళల 53కేజీల విభాగంలో వినేశ్‌ ఫోగాట్‌ కాంస్య పతకం నెగ్గడంతో పాటు…టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పురుషుల రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, రవి దహియా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్‌కు చేరడంతో వీరికి కాంస్య పతకం ఖరారైంది. దీనితోపాటు ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పురుషుల 65కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్‌ పైనల్స్‌లో కొరియాకు చెందిన సన్‌జాంగ్‌ను 8-1తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బజరంగ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. అదేవిధంగా పురుషుల 57కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్‌ రవి రహియా జపాన్‌ క్రీడాకారుడు యుకి తకాషిని 6-1తేడాతో ఓడించి సగర్వంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టడంతో పాటు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ 62కేజల విభాగంలో నైజీరియా క్రీడాకారిణి అమెనాట్‌ అడెనియా చేతిలో ఓడిపోయింది. అయితే అదెనియా ఫైనల్‌కు చేరడంపైనే సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పతకం ఆధారపడి ఉంది. నైజీరియా క్రీడాకారిణి ఫైనల్‌ చేరుకుంటేనే సాక్షికి రెపిరేజ్‌ ఆడే అవకాశం దక్కుతుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/