బజాజ్‌ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్‌ ‘క్యూట్‌

Bajaj Auto from Quadricycle 'cite
Bajaj Auto from Quadricycle ‘cite

న్యూఢిల్లీ:బజాజ్‌ ఆటో నుంచి సరికొత్త వాహనం మార్కెట్లోకి వచ్చింది. క్వాడ్రిసైకిల్‌ క్యూట్‌ వాహనాన్ని జైపూర్‌లో లాంచ్‌ చేసింది బజాజ్‌. ఈ వాహనం చిన్నగా ఉంటుంది. సిటీలో తిరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. రన్నింగ్‌ కాస్ట్‌ తక్కువ. పెట్రోల్‌ వాహనం అయితే లీటర్‌కు 35కిలోమీటర్లు, సిఎన్జీ అయితే కేజికి 43 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. జైపూర్‌లో పెట్రోల్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.2,62,193కాగా, సిఎన్జీ వేరియంట్‌ ధర రూ.2,82,239గా నిర్ణయించారు. బజాజ్‌ క్యూట్‌ను 15 రాష్ట్రాల్లో ప్రైవేట్‌, 20 రాష్ట్రాల్లో కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. క్వాడ్రిసైకిల్‌ను నాన్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ కేటగిరిలో చేర్చిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ. బజాజ్‌ క్వాడ్రిసైకిల్‌ నాలుగు సీట్ల వాహనం. సిటీ లోపల తిరిగేందుకు అనువైన వాహనంగా ఉంటుంది. అయితే ఇది సిటీ దాటి వెళ్లేందుకు పెద్దగా ఉపయోగపడదు. 216సిసి సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ డిటిఎస్‌ఐ ఇంజిన్‌ ఉంటుంది. గరిష్టంగా 70కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాన్ని నడపొచ్చు. 16ఏళ్లు దాటిన వాళ్లు క్వాడ్రిసైకిల్‌ వాహనాన్ని నడపవచ్చు.

మరిన్ని తాజా తెలంగాణ బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/