ఫాతిమాకు బెయిలు మంజూరు

Rehana Fathima
Rehana Fathima

తిరువనంతపురం: ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపరిచిన ఆరోపణలపై అరెస్ట్ అయిన రెహానా ఫాతిమా (39)కు కేరళ హైకోర్టు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించేందుకు అక్టోబరులో రెహానా విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. రెహానాకు బెయిలు మంజూరు చేసిన కోర్టు పంపా పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి వెళ్లడాన్ని నిషేధించింది. అలాగే, ఆన్‌లైన్‌లో ఎటువంటి పోస్టులు చేయరాదని ఆదేశించింది.