జైలు నుండి బయటకు రానున్న చిదంబరం

రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు

chidambaram
chidambaram

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ప్రస్తుతం తీహార్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. రూ. 2 లక్షల పూచీకత్తుపై ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా కోరింది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. సీబీఐ కేసులో ఇప్పటికే చిదంబరానికి బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఎవిడెన్స్ ను నాశనం చేయడానికి గానీ ప్రయత్నించరాదని హెచ్చరించింది. ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వ్యాఖ్యలనూ చేయరాదని షరతు విధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/