తొలి షట్లర్‌గా మొమోటా: చాంపియన్‌గా సింధు

2019 అద్భుతాలు

Kento Momota & P. V. Sindhu
Kento Momota & P. V. Sindhu

న్యూఢిల్లీ: జపాన్‌ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌‌లో అద్భుతాలు సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ను మొమోటా ఏలాడు. 2019లో కెంటో ఏకంగా 11 టైటిల్స్ సాధించాడు. ఫలితంగా బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే ఏడాదిలో 11 టైటిల్స్‌ నెగ్గిన తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇకపోతే భారత షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది మిక్స్‌డ్ ఫలితాలనిచ్చింది. సింధు ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్ నెగ్గడమే కాస్త గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 217, 217 తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా ఈ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా అరుదైన ఘనత సాధించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/