నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ: జీవీఎల్

G. V. L. Narasimha Rao
G. V. L. Narasimha Rao

విజయవాడ: నేడు ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందనివ్యాఖ్యానించారు.ఎదుటి పార్టీ నేతలపై బురదజల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్, భూ కబ్జాలు, అవినీతి తప్ప చంద్రబాబు పాలనలో మరేమీ కనిపించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ తమపై అసత్య ప్రచారాన్ని చేస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలను, ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూ, ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/