అమెజాన్ లో కాంతారా చూసే ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటిటి ప్రేక్షకుల..ఎదురుచూపులు తెరపడింది. కాంతారా మూవీ ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీ చూసే వారికి ఓ బ్యాడ్ న్యూస్. కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకుంది. దాంతో మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ మూవీ దాదాపు రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు. సినీ లవర్స్ మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం ఈ మూవీ ని చూసి ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ ఈరోజు నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతుంది.

ఇరాక్ సినిమాలో కీలక హైలైట్ గా నిలిచిన ఘట్టం.. రిషబ్ శెట్టి భూతకోల ఆడే సీన్..ఈ సీన్ లో ‘వరాహ రూపం దైవ వరీష్టం..’ అంటూ ఓ పాటు బ్యాగ్రౌండ్ లో వినిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తూ వుంటుంది. రీసెంట్ గా ఈ పాటపై వివాదం చెలరేగడంతో మేకర్స్ ఆ పాటని కట్ చేసి అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చేశారు. ఇది ఇప్పడు ఓటీటీ వెర్షన్ లో లేకపోవడంతో ‘కాంతార’ అభిమానులు షాక్ కు గురవుతున్నారట. సినిమాకు ఆయువు పట్టులాంటి సీన్ నే లేపేయడం తో వారంతా బాధపడుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే..ఓ ఊరి ప్రజల్ని వారి నమ్మకాల్ని కాపాడటం కోసం స్వయంగా వారు కొలిచే దేవుడే వారిలో ఒకడిగా వస్తే..మన చుట్టూ పెరిగిపోతున్న చెడుని అంతం చేస్తే ఏంటనే కథతో ఈ మూవీని తెరకెక్కించారు. కేవలం 15 కోట్లతో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందంటే ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఓటిటి ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.