అసెంబ్లీ వద్ద గవర్నర్‌కు చేదు అనుభవం

పశ్చిమబెంగాల్ గవర్నర్ అసెంబ్లీకి రాకుండా గేటుకు తాళం

Jagdeep Dhankhar
Jagdeep Dhankhar

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సిఎం మమతా బెనర్జీకి గవర్నర్‌ జగదీప్‌ల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్ కు గురయ్యారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గేట్ నంబర్ 2 నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో గవర్నర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటనతో వీరి మధ్య అగాధం మరింత పెరిగినట్టయింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/