యూపీ లో నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో వింత జననం

మాములుగా పుట్టిన శిశువు కు రెండు చేతులు , రెండు కాళ్ళు ఉంటాయి..కానీ యూపీ లో మాత్రం ఓ శిశువు ఏకంగా నాలుగు కాళ్ళు , నాలుగు చేతులు ఉన్నాయి. ఈ శిశువును చూసిన ప్రజలంతా దేవతా ప్రతిరూపమంటూ మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ లో ఓ మహిళకు ఈ శిశువు జన్మచ్చింది.

వివరాల్లోకి వెళ్తే…

హర్దోయ్ లోని షహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కరీనా అనే మహిళ జూలై 2వ తేదీన ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అదేరోజు ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీ కాకపోవటంతో సిజేరియన్ చేశారు. అయితే అంతకు ముందు స్కానింగ్ చేసిన వైద్యులు కవల పిల్లలు ఉన్నట్టు భావించారు. కానీ తీరా డెలివరీ చేసిన తర్వాత షాక్ తిన్నారు. ఆ చిన్నారి నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో పుట్టడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రి వైద్యులు షహాబాద్ నుంచి హర్దోయ్ కి, ఆపై లక్నోకు పంపించారు.

కవలపిల్లలు పుట్టాల్సి ఉన్నా ఒక శిశువు ఎదగకపోవటంతోనే ఇలా పుట్టిన నవజాత శిశువు కడుపుకు అదనపు చేతులు మరియు కాళ్లు అతుక్కుని ఉన్నట్టు డాక్టర్స్ గుర్తించారు. ఇది కవలల కేసు అని, మరో చిన్నారి కూడా పూర్తిగా ఎదగాల్సి ఉన్నా ఎదగలేదని, ఫలితంగా శిశువు నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో జన్మించిందని తెలిపారు. ఈ శిశువును దేవతా ప్రతిరూపంగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇక తన బిడ్డ వింత పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.