జగన్ ను ఓడించడానికి పవన్ – చంద్రబాబు మాస్టర్ ప్లాన్..?

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లు మరోసారి చేతులు కలుపుకోబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014 లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి చెందాడు. ఆ తర్వాత నుండి బిజెపి కి సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు. కానీ బిజెపి తో ఉంటె పవన్ కు ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకే మరోసారి చంద్రబాబు తో చేతులు కలిపి జగన్ ను ఓడించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ-జనసేనలని కలిపేందుకు బీజేపీ సీనియర్ కామినేని శ్రీనివాస్ గట్టిగానే ట్రై చేస్తున్నారట.

కమ్మ వర్గానికి చెందిన కామినేనికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు పవన్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కామినేని తెలుగుదేశం పార్టీ లో పనిచేశారు. అలాగే ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఈయన త్వరలో జనసేన లో చేరాలని అనుకుంటున్నారట. ఒకవేళ బీజేపీ…టీడీపీకి దూరంగా ఉంటే…ఈయన జనసేనలో చేరి…టీడీపీతో పొత్తు సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఇది వర్క్ అవుట్ అవుతుందా..లేదా అనేది చూడాలి.