వరదల విషయంలో జగన్ సర్కార్ కు చంద్రబాబు చురకలు

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ధాటికి రాయలసీమ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. ఈ నేపధ్యంలో రాయల సీమ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును..జగన్ సర్కార్ ఫై చురకలు అంటించారు. రేణిగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా పడుతాయని సమాచారం ఉంది..రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ముందుగానే సమాచారం వచ్చింది…అయినా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదు. దీంతోనే ప్రాణనష్టం అధికంగా ఉందని చంద్రబాబు అన్నారు.

వైపరీత్యాలు చెప్పి రావు.. సమర్థతతో ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాన్ వస్తే .. కేవలం వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కబెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. వర్షాలు కురుస్తాయిని తెలిసినా.. పింఛ, అన్నమయ్య ప్రాజెక్ట్ లను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందే నీటిని విడుదల చేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా అని అన్నారు.