రెండేళ్ల తరువాత ఢిల్లీ లో అడుగుపెట్టిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు..రెండేళ్ల తర్వాత ఢిల్లీ లో అడుగుపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ను కోరనున్నారు. అలాగే ఇటీవల టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడులు, టిడిపి కార్యకర్తలు, నాయకుల నిర్బంధాలు, వేధింపులు పై సిబిఐ దర్యాప్తు ను కోరనున్నారు చంద్రబాబు. ఏపిలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, డిజిపి తో సహా పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వివరించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కలవనున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు మరో ఐదుగురు టీడీపీ నాయకులకు.. రాష్ట్రపతి కార్యాలయం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. విజ్ఞాపన పత్రంలో గంజాయ్, హెరాయన్ అంశాలను కూడా వివరించనున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇంకా వారి అపాయింట్‌మెంట్ అందలేదు. అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నారు.