కొత్త బెంచ్‌ విచారణ

Babri Masjid (File)
Babri Masjid (File)

కొత్త బెంచ్‌ విచారణ

రాజ్యాంగ ధర్మాసనానికి తిరస్కరణ
29నుంచి సమగ్ర విచారణ
అయోధ్య కేసులో ‘ సుప్రీం’ తీర్పు

న్యూఢిల్లీ,: అయోధ్య కేసును ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసేందుకు సుప్రీం బెంచ్‌ నిరాకరించింది. 1994 నాటి తీర్పును పునఃపరిశీలించాలన్న ప్రతి పా దనలను ఆమోదించలేదు. అయోధ్య స్థల వివాదంలో ఆనాటి విచారణ సందర్భంగా మసీదులు ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని, 1994 న్యాయస్థానం తీర్పుకే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడిం చింది. ముగ్గురు సభ్యులున్న ధర్మా సనంలో ఇద్దరు న్యాయ మూర్తులు ఈ సివిల్‌ వ్యాజ్యాన్ని అంతకుముందు తీర్పులో సాక్ష్యా ధారాల ఆధారంగా నిర్ణయిం చారని, అందువల్ల ఇపుడు ధర్మాస నా నికి బదిలీచేసేందుకు సరైన ఆధారాలు లేవని అన్నారు. జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ తీర్పును చదువుతూ 1994 నాడు ఐదుగురుసభ్యులిచ్చిన తీర్పును పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అన్ని మసీదులు, చర్చిలు, దేవాలయాలు ఆయా మతాలకు ప్రాధాన్యమని వెల్లడించింది. జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఒక్కరే మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులతో విభేదించారు. మసీదులు ఇస్లాంమతంలో అంతర్భాగమని మతవిశ్వాసాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని, అందువల్ల సమగ్ర పరిశీలన అవసరమని రాజ్యాంగ ధర్మాసనానికే నివేదించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేసారు. అంతేకాకుండా ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులనుసైతం ఇందుకు ఉదహరించారు.

ఇటీవలే ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోనికి తీసుకుని రాజ్యాంగధర్మాసనం సమగ్ర విచారణ అవసరం అవుతుందని అన్నారు. దీనిపై చీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షతన ఉన్న బెంచ్‌ స్పందిస్తూ ఇకపై ఈ వివాదాస్పద స్థలంపై కొత్తగా ఏర్పాటుచేసే బెంచ్‌ వచ్చేనెల 29వ తేదీనుంచి విచారణచేస్తుందని అన్నారు. చీఫ్‌జస్టిస్‌ వచేచనెల 2వ తేదీన పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనాడు అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పుప్రకారంచూస్తే వివాదాస్పద స్థలాన్ని రాజమజన్మభూమి, బాబ్రిమసీదు ప్రాంతంలో ఉన్న భూమినిమూడు భాగాలుగా విభజించింది. అలహాబాద్‌ తీర్పును సవాల్‌చేస్తూ లెక్కలేనన్ని అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులున్న బెంచ్‌ ఇద్దరు మెజార్టీ రూలింగ్‌తోనే నడిచింది. 2.77 ఎకరాల ఈ భూమిని మూడు సమానభాగాలుగా విభించి ముగ్గురికి అప్పగించాలని ఒకటి సున్నీ వక్ఫ్‌బోర్డు, రెండోది నిర్మోహి అఖారా, మూడు రామ్‌ లల్లా సంస్థలకు సమానంగా విభజించాలని అప్పట్లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ స్థల వివాదాన్ని వచ్చేనెల 29వ తేదీనుంచి క్రమం తప్పకుండా విచారిస్తుందని తెలిపారు.

ఇస్మాయిల్‌ఫరూఖి అనే వ్యక్తి దాఖలుచేసిన కేసుకు సంబంధించి ఇస్లామ్‌,నమాజ్‌లకు సంబంధించి మసీదులు అత్యవసర భాగం కాదని, ముస్లింలు ఎక్కడైనాప్రార్ధనలు చేసుకోవచ్చని, బహిరంగ ప్రదేశాల్లో కూడా చేయవచ్చని వెల్లడించింది. దీనిపై ముస్లిం సంస్థలు ఇస్లామ్‌ మతంలో మసీదులు అంతర్భాగమని, నమాజ్‌లు మసీదులోపల నిర్వహించుకునే సాంప్రదాయం ఉన్నందున ఐదుగురుసభ్యులున్న ధర్మాసనం విచారణచేయాలని పట్టుబట్టాయి. అయితే ఈకేసులో వివాదాస్పద స్థలంపైనే విచారణజరుగుతున్నందున ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకోలేదు.గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులను, ఇతర అంశాలను పరిశీలనకు తీసుకోలేమని, ఏడుగురుసభ్యులున్న బెంచ్‌కు ఇవి ప్రామాణికం కావని వెల్లడించారు. ముస్లింసంస్థల తరపున అప్పీలు చేసిన సంస్థలకు సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ధావన్‌ వాదిస్తూ ఇస్మాయిల్‌ ఫరూకీ కేసులో ఇచ్చిన తీర్పు ఇస్లామ్‌లో మసీదుల హోదానుదెబ్బతీస్తోందని వాదించారు. ఇస్లాం మతంలో అంతర్భాగమైన మసీదులను పరిగణలోనికి తీసుకుంటే ఆ మతంలో కీలకభాగం నిర్వీర్యం చేసినట్లే అవుతుందని, మసీదులు ప్రార్ధనలకు నిర్దేశించినవని అన్ని మతాల తరహాలోనే ఇస్లాంలో మసీదులు అంతర్భాగమని అన్నారు.

సీనియర్‌ న్యాయవాది సిఎస్‌ వైద్యనాధన్‌ హిందూ ధార్మకసంస్థలతరపున వాదిస్తూ 1994తీర్పును విభేదిస్తూ అన్ని మతాలకు చెందిన ప్రార్థనాస్థలాలు సమానమేనని అన్నింటికీ ప్రభుత్వ సేకరణ చేయవచ్చన్నది సందేహాస్పదమైనదని అన్నారు. మసీదులు ఇస్లామ్‌లో అంతర్భాగం కాదని, వాస్తవానికి ముస్లింలు ప్రార్థనలు ఎక్కడైనా చేసుకోవచ్చని, అలాంటప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలను అనుసరించి స్థలసేకరణకు ప్రతిఘాతం కాదని వ్యాక్యానించారు. ఇస్లామ్‌ మతానికి ఉన్నట్లుగానే అన్ని మతాలకు సమానస్వేఛ్ఛ ఉంటుందని, ఇతర మతాల్లో కూడా అదే విధంగా ప్రార్థనలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని వాదించారు.