రేపు బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు..కేంద్రం ఆదేశాలు

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భద్రతను పెంచాలి..కేంద్రం

Babri Masjid verdict tomorrow

న్యూఢిల్లీ: రేపు బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలుబ‌డ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సున్నిత‌మైన‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌తను పెంచాలంటూ ఆదేశించారు. సీబీఐకి చెందిన ప్ర‌త్యేక కోర్టు బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు ల‌క్నోలో తీర్పును ఇవ్వ‌నున్న‌ది. ఈ తీర్పు వ‌ల్ల శాంతి, భ‌ద్ర‌త‌ల‌పై స‌మ‌స్య త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని, రెండు వ‌ర్గాల చెందిన వారు అల్ల‌ర్ల‌కు దిగే అవ‌కాశం ఉంద‌ని, అందుకే భ‌ద్ర‌త‌ను పెంచాలంటూ కేంద్రం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. రామ‌జ‌న్మ‌భూమి బాబ్రీ మ‌సీదు కేసులో నిందితులు దోషులుగా తేలుతార‌ని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయ‌ని, ఒక‌వేళ తీర్పు వారి ప‌క్షం లేకుంటే దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. మ‌త‌ప‌రంగా సున్నితంగా ఉండే జిల్లాల్లో భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని కేంద్రం సూచించింది.

కాగా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, అనాటీ బీజేపీ నేతలు మురళీ మనోహర్ జ్యోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహరాజ్ తదితరులను ఈనెల 30వ తేదీన కోర్టుకు హాజ‌రుకావాల‌ని ఇటీవ‌ల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/