హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

hyderabad-old-city
hyderabad-old-city

హైదరాబాద్‌: భారత దేశంలో సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మార్చిన రోజు డిసెంబర్‌ 6 అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతతో మతపరంగా చూసినా 1992 బాబ్రీ ఘటన తర్వాత, దేశంలో మతం పేరుతో హింస జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మత ఘర్షణల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల అయోధ్య కేసులో సంచలనాత్మక తీర్పు వెలువడిన తరుణంలో ..బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు రేపు కావడంతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో కూడా రెండ్రోజుల పాటు 144 సెక్షన్‌ విధించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్‌ 6న మత విద్వేశాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడటం కోసం హైదరబాద్‌ సిటీ పరిధిలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/