7సూపర్‌ మ్యాన్‌గా మారిన పాక్‌ క్రికెటర్‌

BABAR
BABAR

7సూపర్‌ మ్యాన్‌గా మారిన పాక్‌ క్రికెటర్‌

దుబాయి: పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా మధ్య దుబాయి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో భాగంగా 128వ ఓవర్‌లో పాక్‌ బౌలర్‌ వేసిన బంతిని ఆసీస్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ భారీ షాట్‌గా మలచబో యాడు. అయితే ఈ బంతిని పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ క్యాచ్‌ పట్టాడు. బౌండరీ వైపుగా వెళ్తున్న బంతిని బాబర్‌ గాల్లో ఎగిరి మరీ పట్టుకు న్నాడు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా అవుతోంది. బాల్‌కోసం బాబర్‌ సూపర్‌ మ్యాన్‌లాగా మారాడంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.