బాల గేయం: పువ్వులండి పువ్వులు

బాల గేయం: పువ్వులండి పువ్వులు
Flowers

పువ్వులండి పువ్వులు
ఎంతో చక్కని పువ్వులు
అందమైన పువ్వులు
ఆనందమిచ్చే బలు

హాయినిచ్చేపువ్వులు
ఆహ్వానించే పువ్వులు
దైవం చెంతన పువ్వులు
పూజకు నోచే పువ్వులు

తరుంవులపైనా పువ్వులు
తేనెటీగలకు విందులు
తరుణులు మెచ్చే పువ్ఞ్వలు
తలలో తురిమే పువ్వులు

రాగం పెంచే పువ్వులు
రోగం బాపే పువ్వులు
రంగురంగుల పువ్వులు
రకరకాలుగా పువ్వులు

మనసును దోచే పువ్వులు
ముచ్చటగొలిపే పువ్వులు
మమతను పెంచే పువ్వులు
మనోహరం ఈ పువ్వులు

మకరందాల పువ్వులు
మంగళకరమీ పువ్వులు
పువ్వులండి పువ్వులు
ఎంతో చక్కని పువ్వులు ..

  • వాసుదేవరావ్‌, రావిపల్లి

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/t/8693