చారిత్రక విజయానికి ఐదేళ్లు

జూలై 10, 2015లో ‘బాహుబలి’ విడుదల

baahubali-Five years of historical success
Baahubali-Five years of historical success

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం బాహుబలి. సరిగ్గా ఐదేళ్ల క్రితం జులై 10, 2015లో విడుదల అయ్యింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌,రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు.

సినిమా రిలీజ్‌కి ముందు నుండే టీజర్ ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు రాజమౌళి. ప్రాంతీయ భాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.

బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగేళ్ళ సమయం కేటాయించిన ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు.

ఇక అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ ఈ చిత్రం తిరగరాసింది.

నేటికి ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ జ్ఞాపకాలు పంచుకుంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/