కలకలం రేపిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాంచారమ్మ బస్తీలో శ్రీధర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అయితే, తన చావుకు పక్కింటి వారే కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. నా చావుకి కారణం అనసూర్య ఆమె భర్త దశరధి. వాళ్లే నా చావుకి కారణం. నా జీవితం నాశనం కావడానికి వీళ్లు ఇద్దరే కారణం. ఇట్లు, శ్రీధర్. అని రాసిన సూసైడ్ నోట్ కనిపించింది.
ఇటీవల హైదరాబాద్ మీర్ పేట్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫైనలియర్ చదువతున్న సంధ్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దీంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సంధ్య ఆత్మహత్యకు … లెక్చరెర్ స్వాతి వేధింపులే కారణమని ఆరోపించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/