టిడిపిపై ఆర్ధిక మంత్రి బుగ్గన ఎద్దేవా

b rajendranathreddy
b rajendranathreddy


అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు విత్తనం వేసి ..మొక్క దశ వరకు చేసింది దివంగత సియం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అని ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఏపి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..గవర్నర్‌ ధన్యవాద తీర్మానంపై టిడిపి సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకురావడంతో బుగ్గన మధ్యలో కల్పించుకున్నారు. ప్రభుత్వ ప్రసంగాన్నే గవర్నర్‌ చదువుతారని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 58 పేజీలతో గవర్నర్‌ సందేశాన్ని తయారుచేస్తే..తమ ప్రభుత్వం 15 పేజీలతోనే రూపొందించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని చెప్తున్న అచ్చెన్నాయుడు ఇంతవరకు పోలవరం భూసేకరణ ఇంత వరకు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వానికి అనేక అవార్డులతో పాటు అవినీతిలోనూ అవార్డులు వచ్చాయని ఆయన బుగ్గన గుర్తు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/