హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్‌ విజయం

Azharuddin
Azharuddin

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్‌కు, ప్రకాష్ చందద్ జైన్ ప్యానల్ మధ్య రసవత్తరమైన పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ చందద్ జైన్‌పై 146 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్‌ విజయం సాధించారు. ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. అర్జున్ యాదవ్, నిజాం క్లబ్, భారతి సిమెంట్స్ ప్యానెల్ ఓటు వేయలేదు.హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ గురువారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/