నాడు అజారుద్ధీన్‌, నేడు కోహ్లీ

AZHAR, KOHLI1
AZHAR, KOHLI

నాడు అజారుద్ధీన్‌, నేడు కోహ్లీ

న్యూఢిల్లీ: తాజా టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-4తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు కోల్పోయింది. టెస్టు ఫార్మట్‌లో నెంబర్‌వన్‌ ర్యాంకు జట్టు విదేశీ గడ్డపై ఇంతలా పరాభవాన్ని చవిచూస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు కూడా భావించలేదు. ఈ ఓటమితో భారత్‌ ఓ చెత్త రికార్డును పునరావృతం చేసింది. అది కూడా 27ఏళ్ల తర్వాత కావడం గమనార్హం. చెత్త రికార్డు విషయానికొస్తే…భారత జట్టు 5 టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం చివరిగా 1991-92లో జరిగింది. దాదాపు 27ఏళ్‌ల తర్వాత భారత్‌ ఓ టెస్టు సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. దూకుడుకు మారుపేరుగా నిలిచే విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో ఇది జరగడం గమనార్హం. 1991లో మహ్మద్‌ అజారుద్దీన్‌ నాయకత్వంలో టీమిండియా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడగా…కేవలం అడిలైడ్‌లో జరిగిన ఓ టెస్టు డ్రాగా ముగిసింది. మిగతా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్‌ 4-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి నిన్నటి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ వరకు…భారత్‌ ఆడిన ఏ టెస్టు సిరీస్‌లోనూ 4 టెస్టులు ఓడిపోలేదు. కాగా, ఇటీవల టెస్టు సరరిరీస్‌లో భారత్‌ ఒక్క మ్యాచ్‌ గెలవగా…గతంలో ఆసీస్‌ చేతిలో ఓడిన సిరీస్‌లో ఓ టెస్ట్‌ డ్రా కావడం తప్ప ఏ వ్యత్యాసమూ లేదు. తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంతో ఆపటు జట్టులోనూ నూతనోత్సాహాన్ని రగిలించిన క్రికెటర్‌ కోహ్లీ. అయితే తాజా సిరీస్‌ పరాభవాన్ని రెండున్నర దశాబ్ధాల కిందట ఆసీస్‌ చేతిలో ఎదురైన సిరీస్‌ పరాభవంతో క్రికెట్‌ విశ్లేషకులు పోల్చుతున్నారు. సిరీస్‌ కోల్పోయినా తాజాగా ఐసిసి తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానం నిలబెట్టుకుంది. సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ సైతం నెం.1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. =====