రోజా ఆంటీ అంటూ మంత్రి రోజా ఫై అయ్యన్నపాత్రుడు వరుస ట్వీట్స్

టీడీపీ పార్టీ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..వైస్సార్సీపీ మంత్రి రోజా ఫై వరుస ట్వీట్స్ తో విరుచుకపడ్డారు. రోజా ఆంటీ అరంగుళం మేకప్ వేసుకొని వచ్చేయడానికి ఇది జబర్దస్త్ షో కాదు.. స్క్రిప్ట్ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకు జట్కా బండి షో కాదు.. దొంగ పెట్టిన దొంగ ఛానల్ సాక్షి వాళ్ళ స్క్రిప్టు పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్ అయిపోతావ్ అంటూ విమర్శించారు.

రాసిన వాడు అంటే జగన్ రెడ్డి లాగే పదవ తరగతి పేపర్లు ఎత్తుకెళ్లి పాస్ అయినవాడు అనుకుందాం. చదివే యాంకరమ్మకి మతి ఉండాలి కదా అన్నారు. విశాఖ జిల్లాలో తాళ్లవలస అయితే శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస అంటోంది. జై బాబు అని జనం అంటుంటే.. జై జగన్ అన్నారని కోడి కత్తి కథలు చెబుతోంది. అమీర్ పెట్ ఎడిటింగ్లు.. మార్కాపురం మార్పింగులతో ఇంకెన్నాళ్లీ “జగన్నాటకం” అంటూ ఆయన వరుస ట్వీట్స్ చేసారు అయ్యన్న.

రోజా ఆంటీ అరంగుళం మేక‌ప్ వేసుకుని వ‌చ్చేయ‌డానికి ఇది జ‌బ‌ర్ద‌స్త్ షో కాదు.
స్క్రిప్ట్ లో డైలాగుల‌తో ఉతికేయ‌డానికి ఇది బ‌తుకుజ‌ట్కా బండి షో కాదు.
దొంగ పెట్టిన దొంగ చాన‌ల్ సాక్షి వాళ్ల స్క్రిప్టు ప‌ట్టుకుని వ‌స్తే ఇలాగే అడ్డంగా బుక్క‌యిపోతావు.
1/3 pic.twitter.com/nuWzdFmEzN— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 6, 2022