అయోధ్యలో ఉద్రిక్తత పరిస్థితులు

Ayodhya
Ayodhya

ఉత్తరప్రదేశ్‌ :  అయోధ్యలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రామ మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఈ రోజు అయోధ్యలో ధర్మసభ జరగనుంది. సాధుసంతుల ధర్మసభ, ఉద్దవ్‌ థాకరే పర్యటన నేపథ్యంలో రామభక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలు మోహరించారు. ధర్మసభ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.