రక్షణ వలయంలో అయోధ్య రామజన్మభూమి

ayodhya
Police security

అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఇపుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి బాబ్రీ మసీదు ప్రాంతాన్ని ఒక పటిష్టమైన రక్షణ వలయంతో శతృదుర్భేధ్యమైన మహారాజుకోటగా మార్చేసారు. ఈనెల 17వ తేదీలోపు ఏరోజయినా అయోధ్య కేసుతీర్పు వెలువడనున్న నేపథ్యంలో మొత్తంప్రపంచం దృష్టి అంతా అయోధ్యవైపే కేంద్రీకృతం అయింది. అయోధ్యలోని పరిస్థితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఎవ్వరినీ వివాదాస్పద వ్యాఖ్యలుచేయవద్దని ఆదేశాలు జారీచేసారు. అంతేకాకుండా ప్రత్యేక సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌ తివారి, డిజిపి ఒపిసింగ్‌ వంటి సీనియర్‌ అధికారులు మొత్తం పాల్గొన్నారు. అంతేకాకుండా చీఫ్‌జస్టిస్‌ రంజన్‌గగో§్‌ుకూడా యుపికి చెందినసీనియర్‌ అధికారులతో చర్చలుజరిపారు. ఛీఫ్‌జస్టిస్‌ఛాంబర్‌లోనే ఈ సమావేశం జరిగింది.ఏపరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను సిద్ధంచేసింది. అత్యవసరపరిస్థితుల్లోవీటిని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి కంట్రోల్‌రూమ్‌ను లక్నోలో ఏర్పాటు చేసింది. అదనంగాప్రతిజిల్లాలోను కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేసింది. ఐదువేలమందికిపైగా సిఆర్‌పిఎప్‌ దళాలు నగరానికి చేరుకున్నాయి. అంతేకాకుండా సోషల్‌మీడియా సైట్లను కూడా ఎక్కడికక్కడ సమీక్షిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/