భూమిపూజకు బయలుదేరిన ప్రధాని

pm modi

న్యూఢిల్లీ: నేడు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు భూమిపూజ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని అధికారులు అణువణువునా శానిటైజ్‌ చేశారు. ముఖ్యంగా ప్రముఖులు సందర్శించనున్న ఆలయాలను క్రిమినిరోధక ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడి హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు. కోవిడ్‌-19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/