మధ్యవర్తులకు సాధ్యం కాదు

ayodhya land dispute case
ayodhya land dispute case


హైదరాబాద్‌: అయోధ్య వివాదం మధ్యవర్తులతో పరిష్కారం సాధ్యం కాదని శివసేన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రామాలయ నిర్మాణ విషయంలో కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి, వెంటనే ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. రాజకీయ నాయకులు, పాలకులు, సుప్రీం కోర్టు కూడా అయోధ్య వివాదాన్ని పరిష్కరించలేకపోయారని, అలాంటి సందర్భంలో మధ్యవర్తులు ఏం చేస్తారని ఆ పార్టీ ప్రశ్నించింది. అయోధ్య వివాద పరిష్కారం కోసం ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటీని నియమించిన సందర్భంలో నేడు శివసేన పార్టీ స్పందించింది. మధ్యవర్తులతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తే, గత 25 ఏళ్లుగా సమస్య ఎందుకు అలాగూ ఉండిసోయిందని శివసేన అనుబంధ పత్రిక సామ్నా ప్రశ్నించింది.