అయ్యేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తి

పుర్రె, అస్థికలపై గాయాలు

Ayesha Meera
Ayesha Meera

గుంటూరు: ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది.దాదాపు ఆరు గంటల పాటు అధికారుల పర్యవేక్షణలో రీపోస్టుమార్టం పూర్తి చేశారు. అయేషామీరా మృతదేహం వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. తెనాలి సబ్ కలెక్టర్, ఎమ్మార్వో పంచనామా ప్రక్రియను పరిశీలించారు. ఆయేషా మీరా హత్యకేసును సిబిఐ సీరియస్‌గా విచారణ పూర్తి చేస్తోంది. శవపరీక్ష పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రిపోర్ట్‌ను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించారు. ఆయేషా మీరా ఎముకల నుంచి అవశేషాలు సేకరించారు. సిబిఐ ఎస్పీ విమల్ నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. 2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/