మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదు

మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదు

కరోనా మహమ్మారి తగ్గుతున్న క్రమంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడం..అది కూడా రెండు డోసుల టీకాలు వేసుకున్న కానీ ఏవై.4 కరోనా వేరియంట్ బారిన పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మధ్యప్రదేశ్​ ఇండోర్ లో ఏడుగురికి ఏవై.4 రకం కరోనా కొత్త వేరియంట్​ సోకినట్లు తేలింది. మహారాష్ట్రలో 1 శాతం నమూనాలలో కొత్త డెల్టా ఏవై.4 వేరియంట్ కనుగొనబడింది.

“దిల్లీకి చెందిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఏడుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం సెప్టెంబరులో దిల్లీకి పంపగా.. ఈ ఫలితాలు వెలువడ్డాయి.”-బీఎస్ సైత్య, ముఖ్య వైద్యాధికారి. ఈ ఆరుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మరో 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని వైద్యాధికారి వెల్లడించారు. ఏవై.4 ఓ కొత్త రకం వేరియంట్​ అని.. దీనికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదని ఇండోర్​లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా చెప్పారు.

ఇండోర్ జిల్లాలో ఇప్పటివరకు ఒక లక్షా 53వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 1,391 మంది కరోనాకు బలయ్యారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మధ్యప్రదేశ్ లో తీవ్రంగా ప్రభావితమైన జిల్లా ఏదైనా ఉందంటే అది ఇండోర్. ఇక, ఇప్పుడిప్పుడే దేశం డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటోంది. ఇటువంటి తరుణంలో మరో కొత్త రకం వేరియంట్ రావటం ఆందోళనకు గురి చేస్తోంది