మాస్క్‌లపై అవగాహన
ధరించటం ఎంతో అవసరం

కరోనా వైరస్‌కు మాస్క్‌లు ధరించడం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైనది. మాస్క్‌ల ఎంపిక, వాడకం పట్ల కూడా అవగాహన ఉండాలి.
ఎన్ 99, ఎన్ 95 మాస్క్‌లు రెండు రకాలుగా ఉన్నాయి. ఇవి రెండూ మంచివే. వీటిల్లో పీల్చే గాలి వడకట్టే ఫిల్టర్లు ఉంటాయి.
ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ వాష్ లేదా సబ్బుతో చేతులు కడుక్కుని మాస్క్‌లు వాడితే కరోనా వైరస్ నుండి పూర్తి రక్షణ పొందవచ్చు.
అందుకే మాస్క్ పెట్టుకున్నప్పుడు, తీసినప్పుడు తప్పకుండా చేతులు శుభ్రపరచుకోవాలి. ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి.
ఒకవేళ మాస్క్ తడిస్తే వెంటనే తీసేయాలి. తిరిగి వాడకూడదు.
సింగిల్ యూజ్ మాస్క్‌లను రెండోసారి వాడకూడదు. మాస్క్‌ను తీసేటప్పుడు ముందు నుంచి వెనుక వైపు నుంచి తీసేయాలి. మాస్క్ ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదు.
ఒకవేళ తాకినా వెంటనే చేతులు కడుక్కోవాలి.
వాడేసిన మాస్క్‌ను మూత కలిగి ఉన్న డస్ట్‌బిన్‌లో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/