గుండె వ్యాధులపై అవగాహన అవసరం

ప్రతీ లక్ష ప్రజానీకంలో 4,280 మరణాలు ఆకస్మికంగా వచ్చే గుండె పోటువల్లే!

Awareness on heart disease is needed
Awareness on heart disease is needed


ప్రమాదంలో ఉన్నతీవ్రఅనారోగ్యానికి గురైన బాధితులను ఆస్పత్రిలో చేర్చి పూర్తిస్థాయి వైద్యం అందేవరకు అవసరమైన ప్రాథమిక చికిత్సను అందించే ప్రక్రియను బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లేదా కార్డియో పల్మనరి రిససిటేషన్‌ అంటారు.

ఈ సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులకు కార్డియో పల్మనరి రిససిటేషన్‌ అండ్‌ ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేషన్‌ నైపు ణ్యాలతో ప్రాథమికంగా రక్షించవచ్చు. పరిజ్ఞానం డాక్టర్లు, నర్సులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజానీకం తెలుసుకున్నట్లయితే హృదయ శ్వాస సంబంధ ఆపదలలోని బాధితులకు సహాయపడి వారి ప్రాణాలను సురక్షితంగా కాపాడవచ్చు.

గుండెపోటు వచ్చిన తర్వాత కోలుకునే అవకాశం ప్రతీ నిమిషానికి ఏడు నుంచిఎనిమిది శాతం తగ్గుతుంది. హాస్పిటల్‌ బయట గుండెపోటు వచ్చినవారిలో కేవలం 46 శాతం మందికే సిపిఆర్‌ అందుతున్నది. సిపిఆర్‌ సత్వరంగా చేసినచో కోలుకునే అవకాశం రెండింతలు లేదా మూడింతలు పెరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల ప్రజానీకం గుండెజబ్బులతో మరణిస్తున్నారు. ప్రతి తొంబై సెకన్లకు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణిస్తున్నారు.అన్ని కేన్సర్ల మరణాల సంఖ్య కంటే గుండె సంబంధ జబ్బుల నుండి మర ణించేవారి సంఖ్య ఎక్కువ.భారత గణాంకాలను చూస్తే ప్రతీ ఒక్క లక్ష ప్రజానీకానికి 4280 మరణాలు ఆకస్మికంగా వచ్చే గుండె పోటువల్ల జరుగుతున్నాయి.

అన్ని గుండె జబ్బులతో మరణించే వారిలో 60 శాతం మంది ఆకస్మికంగా వచ్చే గుండెపోటుతో మర ణిస్తున్నారు.గుండెపోటుతో ఆస్పత్రిలో మరణిస్తున్న వారు 30 శాతం కాగా 70శాతం మంది ఆస్పత్రి బయట గుండెపోటు రావ డంతో మరణిస్తున్నారు.

ఈ బయట జరిగే 70 శాతం మరణాల్లో 70 నుంచి 80 శాతం ఇంట్లో జరుగుతున్నాయి.కావ్ఞన 70 శాతం నుండి 80 శాతం ఇంట్లో జరిగే వారికి సిపిఆర్‌ అండ్‌ ఎఇడి శిక్షణ ఇచ్చినచో వారి ప్రాణాలను రక్షించినవారు అవుతాం. ప్రపంచవ్యాప్తంగా రిససిటేషన్‌ సంస్థలు, మండలాలు ఉన్నాయి. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రమారమి ఏడు లేక ఎనిమిది మండలాలున్నాయి.

ఈ మండలాలు అన్ని కలిసి 1992 ఇంటర్నెషనల్‌ లైజన్‌ కమిటీ ఆన్‌ రిససిటేషన్‌గా ఏర్పడి తర్వాత 1994లో సంస్థగా ఏర్పడినవి. దీని హెడ్‌ క్వాటర్స్‌ బెల్జియం దేశంలో ఉంది. వీటిలో మొదటగా 1920 దశకంలో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఒక స్వచ్ఛంద సంస్థగా మొదలైనది.

ఈ సంస్థలో ఎమర్జెన్సీ కార్డియో వ్యాస్‌కులర్‌ కేర్‌ కమిటీ మొదటగా 1974లో సిపిఆర్‌ అండ్‌ ఇసిసి మార్గదర్శకాలు జారీ చేసింది. తర్వాత 1980, 86, 1992లలో కూడా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 1992 నుండి ఐఎల్‌సిఒఆర్‌ ఏర్పడిన తర్వాత ప్రతీ అయిదు సంవత్సరాలకు ఈ మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి.

సరికొత్తగా మార్గదర్శకాలు అక్టోబరులో 2020లో విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలు సర్కులేషన్‌ రిససిటేషన్‌ అనే అంతర్జా తీయ జర్నల్స్‌లో ప్రచురించారు.ప్రస్తుతం 2020కి మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి వాడుకలోకి వచ్చా యి. ఈ కమిటీ ఐఎల్‌సిఒఆర్‌ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి రెండు సార్లు కమిటీ సమావేశం అవ్ఞతుంది. ఒక సమావేశం అమెరికాలో, ఇంకొక సమావేశం అమెరికా దేశం బయట సమావేశం అవుతుంది.

42వ సమావేశం 2020లో దక్షిణాఫ్రికా లోని కేప్‌టౌన్‌ నగరంలో జరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో తదుపరి సమావేశం మళ్లీ జరగలేదు. మన భారతదేశంలో రమారమి 100 అమెరికా హార్ట్‌ అసోసియేషన్‌ ఇంటర్నేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ ఉన్నాయి. ఇవి సిపిఆర్‌ అండ్‌ ఇసిసి గురించి శిక్షణ ఆరోగ్య సిబ్బందికే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాశ్చాత్యదేశాల్లో సిపిఆర్‌ గూర్చి అవగాహన ఎక్కువగా ఉంది.

కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఆటో మేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌ అందుబాటులో ఉన్నది. ఉదాహ రణకు పాశ్చాత్యదేశాల్లోని మాల్స్‌,మల్టీఫెక్సులు, ఎయిర్‌పోర్టులలో అందుబాటులో ఉంది. హాస్పిటల్స్‌లో, హాస్పిటల్‌ బయట గుండె పోటుతో మరణించే వారి సమాచారం రిజిస్ట్రీ ద్వారా మెయిన్‌ టెయిన్‌ చేయడం ఎంతైనా అవసరం. ప్రపంచవ్యాప్తంగా చాలా కార్డియో కార్రెస్ట్‌ రిజిస్ట్రీ ఉన్నా ఇందులో అమెరికాలోని కేర్స్‌ (సిఎఆర్‌ఇఎస్‌), ఇంకొకటి పిఎఆర్‌ఒఎస్‌లు ప్రముఖమైనవి.

భారత దేశంలో వరంగల్‌ నగరంలో2018లో (వరంగల్‌ ఎరియా కార్డియో కార్రెస్ట్‌ రిజిస్ట్రీ) ఏర్పాటు చేయబడినది. ఇలాంటి రిజిస్ట్రీలు ప్రతి ఒక్క నగరంలో ఏర్పాటు చేయవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. రిజిస్ట్రీలను విశ్లేషించి సామాన్య ప్రజానీకానికి వీటి ద్వారా అవగా హన శిబిరాలు నిర్వహించి, చైతన్యంకల్పించి గుండెపోటు ద్వారా జరిగే మరణాలను తగ్గించవచ్చు.

భారతదేశంలో సిపిఆర్‌ను విరి విరిగా అభివృద్ధి చేయడానికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి. 70శాతం జనాభా గ్రామీణ ప్రజానీకం. ఎక్కువ శాతంగా ఉన్న నిరక్షరాస్యత, ప్రాథమిక దశలో ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్‌.

వీటిని అధిగమించి సిపిఆర్‌ను విస్త్రృతంగా భారతదేశంలో అవగాహన కల్పించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది.కానీ మన భారతదేశం లో దీనిపై రెండు శాతంకంటే తక్కువమందికి దీని గూర్చి అవగా హన ఉంది. కావున దీని గూర్చి అవగాహన కల్పించడమే కాక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  • డాక్టర్‌ బి. విజయ్ రావు
    (రచయిత: ప్రొఫెసర్‌ ఆఫ్‌ రిససిటేషన్‌ మెడిసిన్‌)

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/